రాయగడ: పూరీ నుంచి కోట్‌పాడ్‌కు వెళ్తున్న ఓఎస్‌ఆర్టీసీ బస్సు జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధి అకుసింగి వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యింది. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పద్మపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి పద్మపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కోట్‌పాడ్ వెళ్లేందుకు పూరీలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు బస్సు బయలు దేరింది. ఈ సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యలో ఒక డాబావద్ద బస్సును నిలిపి ప్రయాణికులు భోజనాలు చేసిన అనంతరం అక్కడ నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరింది. ఈ క్రమంలోనే పద్మపూర్ సమీపంలోని అకుసింగికి బస్సు చేరే క్రమంలో బుధవారం వేకువ జామున మూడు గంటల సమయంలో బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి బోల్తా పడింది.
మద్యం మత్తులో డ్రైవర్
డాబా వద్ద బస్సును ఆపిప్పుడు డ్రైవరు మద్యం తాగినట్టు కొందరు ప్రయాణికులు ఆరోపించారు. మద్యం మత్తులో బస్సును డ్రైవర్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పెద్ద శబ్దంతో బస్సు బోల్తాపడడంతో భయంతో కేకలు వేశామని చెప్పారు. సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్ల సహాయంతో బస్సు లోపల నుంచి ప్రాణాలతో బయటకు వచ్చామన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన పది మందిని అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద బయటకు తీయగలిగారని చెప్పారు.
పది మందికి గాయాలు
ఆర్టీసీ బస్సు బోల్తా
ఆర్టీసీ బస్సు బోల్తా
ఆర్టీసీ బస్సు బోల్తా