
కలక్టర్ దృష్టికి డొంగిరియాల సమస్యలు
రాయగడ : కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని ఆదిమతెగకు చెందిన డొంగిరియా ఆదివాసీలు మంగళవారం భేటీ అయ్యారు. జిల్లాలోని బిసంకటక్ సమితి కుర్లి పంచాయతీ, మునిగుడ సమితి మునిఖొల్ పంచాయతీ, కల్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలకు చెందిన డొంగిరియా ప్రజలు తమ ప్రాంత సమస్యలను వివరించారు. నియమగిరి పర్వత ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తమకు అందడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సమాజ సేవకుడు, డొంగిరియా తెగ ప్రతినిధి జితు జకసిక తదితరులు పాల్గొన్నారు.