
● సీసీ కెమెరాలు ఏర్పాటు
జయపురం: మున్సిపాలిటీ పరిధి పారాబెడ ప్రాంతం సంతోషిమానగర్‌లో తరచూ జరుగుతున్న దొంగతనాలు, అసాంఘిక శక్తుల ఆగడాలపై నిఘా పెట్టేందుకు ఎట్టకేలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. సీసీ కెమెరాలను ఎమ్మెల్యే బాహిణీపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతోషిమానగర్‌లో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు పార్క్ ఏర్పాటుకు సహకరిస్తానని తెలియజేశారు. సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్య రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భధ్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుందని సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కవాసీ వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నరేంద్ర కుమార్ మహంతి, కమిటీ అధ్యక్షుడు ప్రశాంత పండ, సురమ మహాపాత్రో, ప్రకాశ మిశ్ర, రామనాథ్ సాహు, అజయ మిశ్ర, చంద్రశేఖర మిశ్ర, అజయ పాడి, ప్రదీప్ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.

● సీసీ కెమెరాలు ఏర్పాటు