
● క్లర్క్ ఉద్యోగుల ధర్నా
మల్కన్‌గిరి: జిల్లాలోని ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట మరోసారి మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా క్లర్క్ సంఘాలు అనేక సార్లు సమావేశమై సమస్యలు గురించి అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుంటే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి దిలీప్ నాయక్ టుకుణా పడియారి, రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు శ్యామ్ సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.