
మహిళల పాలిట శాపంగా కూటమి పాలన
● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా న్ని చంద్రబాబు ప్రభుత్వం మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసి గుడి, బడి, నివాస గృహాలు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మద్యం అమ్మకాలు సాగిస్తూ లక్షలాది కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. విచ్చలవిడిగా మద్యం తాగేవారు ఎక్కువ కావడంతో మహిళలు రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాంలో 33 శాతం మద్యం షాపులు తగ్గించడంతో పాటు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లు సైతం తగ్గించేశారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అన్ని బస్సుల్లోనూ ప్రయాణానికి ఆంక్షలు కల్పించాలని కోరారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం సీఎం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.
తీరంలో మృతదేహం కలకలం
సరుబుజ్జిలి : వంశధార నదీ తీరప్రాంతంలోని తెలికిపెంట బ్రిడ్జి వద్ద ఆదివారం గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పాతిపెట్టినట్లు పుకార్లు వ్యాపించాయి. ఈ సమయంలో సమయంలో పోలీసులు రావడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. జలుమూరు మండలం కొండకామేశ్వరపేటకు చెందిన ఓ బిచ్చగాడు అనారోగ్యంతో మృతిచెందాడు. వంశధార ఆవలి ప్రాంతం సక్రమంగా లేకపోవడంతో తెలికిపెంట బ్రిడ్జి సమీపంలో దహనక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా తెలికిపెంట గ్రామస్తులకు సమాచారం వెళ్లడంతో అక్కడ శవాన్ని ఇక్కడ తెచ్చి ఎలా దహనం చేస్తారని అభ్యంతరం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుపక్షాలతో మాట్లాడారు. ఎవరికీ ఇబ్బందిలేని స్థలంలో దహన క్రియలు చేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
బలగలో చోరీ
శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో బలగలోని బండారువీధిలో ఓ వివాహిత ఇంట్లో చోరీ జరిగింది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బండారు వీధిలో సీపాన కోమలి తన కుమారునితో కలిసి ఉంటోంది. ఈ నెల 8న సాయంత్రం సత్యవరం నర్సంపేటలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి కుమారునితో కలిసి వెళ్లింది. ఆదివారం ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయని పొరుగింటి వారు చెప్పడంతో కోమలి వెంటనే ఇంటికి వచ్చి చూసింది. బీరువా తలుపులు పగులగొట్టి ఉండటంతో పాటు అందులో 6 తులాల బంగారం, రూ.50వేలు నగదు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో క్లూస్ టీంతో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బాలియాత్రకు
పూర్వ వైభవం
జలుమూరు: కార్తీక పౌర్ణమి అనంతరం జరగనున్న బాలియాత్రకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. ఆదివారం శ్రీముఖలింగంలో బాలియాత్ర నిర్వహణపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం పాటు జరిగే ఈ వేడుకలకు త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామన్నారు. శ్రీముఖలింగంలో అన్ని కులాలను కలుపుకొని యాత్ర నిర్వహణపై చర్చించనున్నామన్నారు. సమావేశంలో సర్పంచ్ టి.సతీష్ కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.బలరాం, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామపెద్దలు బి.వి.రమణ, తేజేశ్వరరావు, వేణు, చింతాడ వెంకటరావు, హెచ్‌వీ దొర, శేషాద్రి వేంకటాచలం, ఉపాధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు.

మహిళల పాలిట శాపంగా కూటమి పాలన

మహిళల పాలిట శాపంగా కూటమి పాలన