
గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ గ్రామానికి చెందిన రవీంద్ర ప్రధాన్‌తో పాటు పాతపట్నం మండలం కాగువాడ గ్రామానికి చెందిన నవీన్ బరోడా, లావాటి నీలకంటూలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం పాతపట్నం పోలీస్ స్టేషన్‌లో సీఐ వి.రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయ సమీపంలోని మామిడి తోట వద్ద రవీంద్ర ప్రధాన్ కాగువాడకు చెందిన నవీన్ బరోడా, లావాటి నీలకంటూలకు 3.250 కిలోల గంజాయిని అమ్ముతుండగా ఎస్‌ఐ బి.లావణ్య నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పలాస: ఒడిశా రాష్ట్రం అంబుగాన్ గ్రామానికి చెందిన రాహుల్ బూరో అనే వ్యక్తిని 4 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్టు పలాస జి.ఆర్.పి ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలాస రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ హెచ్‌సీ సోమేశ్వరరావు తనిఖీలు చేస్తుండగా రాహుల్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వద్ద సంచిని పరిశీలించగా రెండు బ్యాగుల్లో ఉన్న 4కిలోల గంజాయి గుర్తించారు. తనది ఒడిశా రాష్ట్రమని, తన సోదరుడు పిపిన్ బూరో గంజాయి పండిస్తుంటాడని చెప్పారు. హైదరాబాద్‌లో అమ్మేందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో రాహుల్ సోదరుడు తప్పించుకున్నాడు. గంజాయిని సీజ్ చేసి రాహుల్‌ను కోర్టుకు తరలించి రిమాండ్‌కు పంపించామని ఎస్‌ఐ చెప్పారు.

గంజాయి రవాణా గుట్టురట్టు