
మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభం
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఆదివారం మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా మాజీ సైనికుల సంక్షేమ శాఖ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం సైనిక విధుల్లో ఉన్న వారు, మాజీ సైనికులు 110 మంది సహకారంతో భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ సీపాన అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ సువ్వారి రంగనాధం, కార్యదర్శి పైడి నారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ పైడి వెంకటనారాయణ, కోశాధికారి పైడి రంగనాథం, చైర్మన్ పైడి రామారావు, వైస్ చైర్మన్ సనపల ఫల్గుణరావు, వి.సూర్యనారాయణ, మురళీధరరావు, తర్ర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.