
18 తాబేళ్లు స్వాధీనం
– ఒకరు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు అటవీశాఖ సిబ్బంది సీలేరు నది వద్ద చేపలు పట్టే వ్యక్తి నుంచి 18 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎం.పి.వి 81 గ్రామానికి చెందిన మాన్‌సూన్ ఖేముడు అనే వ్యక్తి భారతీయ ప్లాప్‌షెల్ తాబేళ్లను నది నుంచి వేటాడి గ్రామంలో అమ్మకం కోసం తరలిస్తున్నాడు. మోటు వంతెన వద్ద మోటు అటవిశాఖ రేంజర్ మురళీధర్ అనూగులియా తన సిబ్బందితో పెట్రోలింగ్ కోసం వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వంతెనపై అతి వేగంగా వస్తున్న బైక్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో తాబేళ్లను గుర్తించి నిందితున్ని అరేస్టు చేశారు. శనివారం కేసు నమోదు చేశారు. సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఒక తాబేలు ఖరీదు వేలల్లో ఉంటుందన్నారు.

18 తాబేళ్లు స్వాధీనం