
మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం
జయపురం: మహిళల సాధికారిత, వారి ఆర్థిక ఉన్నతి ప్రధాన లక్ష్యంతో సుభద్ర పథకం అమలు చేస్తున్నామని సీఎం మోహన్‌చరణ్ మాఝి అన్నారు. సుభద్ర పథకం మూడో విడత ఆర్థిక సాయం కార్యక్రమం సందర్భంగా జయపురం రైల్వేస్టేషన్ సమీపంలోగల బంకబిజా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా సాయాన్ని అందజేశారు. నిరు పేదలకు ఇళ్ల స్థలాల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని, ప్రజల ఆకాంక్షలు తప్పకుండా నేరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మోహన్ మఝి తన కొరాపుట్ జిల్లా పర్యటనలో శనివారం భువనేశ్వర్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో జయపురం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి అరవిందనగర్ లోగల సరస్వతీ శిశు మందిర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థినులు సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి పారాబెడ శ్రీరామనగర్ లో ప్రముఖ కార్మిక నేత మాజీ మంత్రి స్వర్గీయ హరిశ్చంద్ర బక్షీపాత్రో పార్క్‌లో బక్షీ పాత్రో విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం సభా ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, మహిళా, శిశు సంక్షేమ,పర్యాటక వికాశ మంత్రి ప్రభాతి పొరిడ,చిన్న, మధ్యమ పరిశ్రమల మంత్రి గోకుల చంద్ర మల్లిక్, ఆదివాసీ, హరిజన, వెనుకబడ్డ వర్గాల సంక్షేమ విభాగ మంత్రి,నిత్యానంద పండ తదితరులు ఉన్నారు. సభలో స్థానిక ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యభాన్ మహాజన్, జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.
గజపతిలో...
పర్లాకిమిడి: రాష్ట్ర ప్రభుత్వం రాఖీ పూర్ణిమ సందర్భంగా మహిళ ఖాతాల్లో సుభద్ర తృతీయ కిస్తీ రూ.5 వేలు డీబీటీ ద్వారా జమ చేసింది. కార్యక్రమాన్ని స్థానిక గజపతి స్టేడియంలో కలెక్టర్ ముధుమిత, ఒడిషా మిషన్‌శక్తి, మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రాఖీ పూర్ణిమ సందర్భంగా అర్హులైన మహిళలు మొత్తం ఒక లక్షా నలభై మూడువేల మందికి రూ.5 వేలు ఖాతాలో వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, సీడీఎంఓ డాక్టర్ ఎంఎం ఆలీ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
రాయగడలో..
రాయగడ: స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో శనివారం సుభద్ర పథకంలో భాగంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని జిల్లా యంత్రాంగం మహిళలకు పంపిణీ చేసింది. రాయగడ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నవీన్ చంద్ర నాయక్ స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలొ ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్ర కాంత్ మాఝి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో గల సాంస్కృతిక భవనంలో శనివారం సుభద్ర యోజన మూడో విడతను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సమారీ టంగులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ సోమేశ్ పాధ్యయాకు రాఖీ కట్టారు.

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం

మహిళా సాధికారత లక్ష్యంతో సుభద్ర పథకం: సీఎం