
ముఖ్యమంత్రి గారూ.. మా గోడు వినండి
జయపురం: ముఖ్యమంత్రి మోహణ మఝి జయపురం వచ్చిన సందర్భంగా సేవా పేపరు మిల్లు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. ఒకే ఒక్క పరిశ్రమ సేవా పేపరు మిల్లును పూర్తి స్థాయిలో పని చేయించేదుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రామికులు, ఉద్యోగులు, కంట్రాక్ట్ కార్మికులు, విశ్రాంత శ్రామికులు, మృతి చెందిన శ్రామిక కుటుంబాలవారి గోడు విని, సమస్యలను పరిష్కరించాలని కోరారు.
న్యాయవాదులకు శిక్షణ
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు శనివారం జిల్లా కోర్టు జయపురంలో ప్యానల్ న్యాయవాదులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణంలో జయపురం ప్రదీకరణ కార్యాలయ సభా గృహంలో ప్యానల్ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో అన్ని తహసీల్ కార్యాలయాలలోనూ జిల్లా ప్యానల్ న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు. శిక్షణ శిబిరాన్ని జిల్లా జడ్జి ప్రారంభించారు. ప్యానల్ న్యాయవాదుల శిక్షణ శిబిర లక్ష్యాలను న్యాయ సేవా ప్రదీకరణ జిల్లా కార్యదర్శి ప్రద్యోమయ సుజాత వివరించారు. శిబిరంలో సివిల్ కోర్టు రిజిస్ట్రార్ బిష్ణు ప్రసాద్ దేవత, శిక్షణ పరామర్శ దాతలు, న్యాయవాదులు హేమంత కుమార్ షొడంగి, ఎ.పి.పి అకమల్ శరీఫ్ పాల్గొని ప్యానల్ న్యాయవాదుల భూమిక, కార్యదక్షత, అధికారం, బాధ్యతలను వివరించారు.
వృద్ధుడు ఆత్మహత్య
నరసన్నపేట: లుకలాంలో పిల్ల అప్పలనాయుడు (66) అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడుర. అనారోగ్యంతో పాటు రెండు కాళ్లు పనిచేయక నడవలేకపోతుండటంతో మనస్తాపంతో వారం కింద ట చీమల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మరణించాడు. కుమారుడు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తలసేమియాతో
బాలుడి మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన చిగురువలస రంజిత్ తలసేమి యా వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. కొద్ది రోజులుగా విశాఖలోని ఓ ప్రైవే ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గత ఏడాది పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన తమ కుమారుడు ఉన్నత స్థాయికి వెళతాడని ఆశించిన తల్లిదండ్రులు సింహాచలం, అనురాధకు తీరని వేదన మిగిలింది. రంజిత్ మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
సారవకోట: అంగూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన ఎల్.శాంతారావు, సారవకోట మండలం గాతలపేటకు చెందిన లక్ష్మణరావులు ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలతో ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నిరుపేదకు అండగా..
వజ్రపుకొత్తూరు: నందిగాం మండలం మర్లపాడుకు చెందిన నిరుపేద సందిపేట మహాలక్ష్మీకి పూండికి చెందిన స్ఫూర్తి సేవా సంస్థ అండగా నిలిచింది. ఇద్దరు ఆడపిల్లలలతో నిలువ నీడ లేని ఆమెకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెంగువ రాంబాబు, 25 మంది ప్రతినిధులు సహకారంతో రూ.3.70లక్షలు వెచ్చించి ఇంటిని నిర్మించారు. శనివారం గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పి.గోవిందరావు, బి.మన్మధరావు, ఉత్తరాల బాలరాజు, సైని హేమారావు, యువతర సేవా సమితి అధ్యక్షుడు చింత మురళి, గున్న వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గారూ.. మా గోడు వినండి

ముఖ్యమంత్రి గారూ.. మా గోడు వినండి