విశాఖలో రాయగడ కార్మికుడు మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ జిరంగో గ్రామ పంచాయతీ రఘునాథపూర్ గ్రామానికి చెందిన వలస కార్మికులు ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు వెళ్లి విధివశాత్తు రెండు రోజుల క్రితం మృతి చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ పేద కుటుంబం సుభాష్ బోడోరయితో పెద్ద కుమారుడు సహాదేవ్ బోడోరయితో (22) తన కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంకు ఉపాధి కోసం కొద్ది రోజుల కిందట ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అయితే ఇటీవలే పనిచేస్తుండగా తన ఆరోగ్యం విషమించి విశాఖపట్నంలో గీతం ప్రైవేటు మెడికల్ కళాశాలలో సిబ్బంది చికిత్సకోసం చేరిన తర్వాత అక్కడ డాక్టర్లు మృతి చెందాడని మే నెల 30న నిర్ధారించారు. చేతిలో డబ్బులు లేనందున ఆయన చేస్తున్న కంపెనీ సహోద్యోగుల సహకారంతో మే 31న రాయగడ బ్లాక్ రఘునాథ్ పూర్‌కు మృతుడు సహాదేవ్ బోడోరయితో శవాన్ని అంబులెన్సులో తీసుకువచ్చి ఆదివారం దహన సంస్కారాలు చేశారు. వలస కార్మికుడి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జిల్లా లేబర్ అధికారిని తండ్రి సుభాష్ బోడోరయితో, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
విశాఖలో రాయగడ కార్మికుడు మృతి
విశాఖలో రాయగడ కార్మికుడు మృతి


