పొగాకు, గంజాయికి దూరంగా ఉండాలి
పర్లాకిమిడి: విద్యార్థులు పొగాకు, గంజాయి, నల్లమందు, ఛరస్ వంటి మత్తునిచ్చే వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఆదనపు వ్యాధుల కంట్రోల్ అధికారి డాక్టర్ ఆనంద్ సామంతరాయ్ అన్నారు. పర్లాకిమిడిలో శనివారం ఉదయం మెడికల్ నుంచి రాజవీధి, బస్టాండు వరకూ నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థినులు, ఆశ వర్కర్ల ర్యాలీని సీడీఎంవో డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం సీడీఎంవో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. పోగాకు సేవించడం వల్ల కలిగే అనర్థాలను ఫుడ్ సెక్యూరిటీ అధికారి తపస్వినీ నాయక్ వివరించారు. ఏ వస్తువు కొన్నా ఎక్స్‌పైరీ తేదీని పరిశీలించాలని, ప్లాస్టిక్ సంచులు తీసుకోరాదని అన్నారు. పోగాకు, క్యాన్సర్‌పై ఆదనపు పీహెచ్‌వో డాక్టర్ ఇందిరా కుమారీ మహాపాత్రో, డాక్టర్ నయన్ మల్లిక్ తదితరులు మాట్లాడారు. ఆశ వర్కర్ల మేనేజర్ నారాయణ మల్లిక్, అసిస్టెంటు మేనేజర్ సూర్యకాంత మిశ్రా పాల్గొన్నారు.
● డాక్టర్ ఆనంద్ సామంతరాయ్
పొగాకు, గంజాయికి దూరంగా ఉండాలి


