కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ
కొరాపుట్: కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. గురువారం రాత్రికి పట్టాలు తప్పిన 37 బోగీల్లో 32 బోగీలు పట్టాలు ఎక్కించారు. టన్నెల్‌లో ఉన్న మిగతా బోగిలు క్రమబద్ధీకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని రైల్వే సర్వీసులు రాయగడ మీదుగా కొరాపుట్ వైపు వెళ్తున్నాయి. కానీ విశాఖ–కిరండోల్ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లని పూర్తిగా రద్దు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిరండోల్ నుంచి ముడి ఇనుప రజనుతో మూడు ఇంజిన్ల గూడ్స్ రైలు విశాఖ వస్తుండగా అరకు సమీపంలో పట్టాలు తప్పింది. ఇప్పటికే వాల్తేర్ డిఆర్‌ఎం లళిత్ బోరా, రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ అమితాబ్ సింఘాల్ పునరుద్ధరణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ పట్నం, రాయగడ, కొరాపుట్, పలాస, కొత్తవలస, విజయ నగరం నుంచి రైల్వే సిబ్బంది వచ్చి పనుల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్‌లో చిక్కుకుండిపోవడంతో పాటు, వర్షాల వల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. 2024 ఫిబ్రవరి నుంచి నేటి వరకు సుమారు 7 సార్లు రైళ్లు పట్టాలు తప్పాయి. పట్టాలు ఎక్కిన కొన్ని బోగిలను చిమిడి పల్లి స్టేషన్ వద్దకు తెచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 22నే రైల్వే భద్రతా సేఫ్టీ కమిషనర్ బ్రజేష్ కుమార్ మిశ్ర ఈ మార్గంలో పర్యటించారు.
కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ
కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ
కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ
కొరాపుట్–కొత్తవలస రైల్వే మార్గం పునరుద్ధరణ


