విజిలెన్స్ వలలో సీనియర్ ఇంజినీర్
రాయగడ: స్థానిక సిరిగుడ సమీపంలోని ప్రజా ఆరోగ్య శాఖలో సీనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న సహదేవ్ కిషాన్ విజిలెన్స్ వలలో చిక్కుకున్నారు. అతని నుంచి రూ.1.50 లక్షల నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం... ప్రజారోగ్య శాఖ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొని కార్యాలయం నుంచి తన వాహనంలో ఇంటికి వెళ్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు వెంబడించారు. అనంతరం ఆయన గృహంలో అతనిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో అరెస్టు చేశారు. అలాగే సహదేవ్‌కు సంబంధించి మరో రెండు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.
విజిలెన్స్ వలలో సీనియర్ ఇంజినీర్
విజిలెన్స్ వలలో సీనియర్ ఇంజినీర్


