భువనేశ్వర్ : స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ(ఐఐటీ) బుధవారం రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచ రుతుచక్ర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సౌజన్యంతో జరిగిన ఈ సమావేశంలో, భారత దేశంలో రుతుక్రమ ఆరోగ్య సమస్యలకు వినూతన, సమగ్ర, సుస్థిరమైన పరిష్కారాలను చర్చించడానికి విధాన నిర్ణేతలు, ప్రజారోగ్య నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు, సామాజిక ఆవిష్కర్తలు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలకు వెళ్లే బాలికలలో పునర్వినియోగ రుతుక్రమ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేర్
(క్యాంపస్ యాక్షన్ ఫర్ రీయూజబుల్ ఎసెన్షియల్స్) నిరుపేద వర్గాల మహిళలకు పర్యావరణ అనుకూలమైన పునర్వినియోగ రుతుక్రమ ప్యాడ్‌లను పంపిణీ చేసింది. అనంతరం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లను ప్రారంభించారు. రుతుస్రావం ఒక సహజ జీవ ప్రక్రియగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్, యూనిసెఫ్ ఒడిశా ఫీల్డ్ ఆఫీస్ హెడ్ విలియన్ హన్లాన్ జూనియర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం


