ఇంద్రావతి నదీ తీరంలో అస్థి పంజరం
కొరాపుట్: ఇంద్రావతి నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి పోలీస్ స్టేషన్ పరిధిలో నందాహండి సమితి ఎకంబా–నువాగాం గ్రామాల మధ్య ప్రజలు స్నానానికి వెళ్లారు. అక్కడ ఇసుకలో అస్థి పంజరం కొంత బయటకు వచ్చి కనిపించింది. దీంతో స్థానిక సర్పంచ్ ద్వారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తవ్వకాలు ప్రారంభించగా అస్థి పంజరంతో పాటు మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఐఐసీ ప్రణవ్ తుడు, అదనపు తహసీల్దార్ పురుషోత్తమ బెనియా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సైంటిఫిక్ టీం రంగంలోకి దిగింది. అనంతరం అస్థి పంజరాన్ని తరలించారు.
ఇంద్రావతి నదీ తీరంలో అస్థి పంజరం


