
తాగునీటి సమస్య పరిష్కరించండి
రాయగడ: కొలనార సమితి పరిధిలో గల తెరువలి పంచాయతీలోని మూడో వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారీని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వార్డులో సుమారు 25 కటుంబాలకు చెందిన వంద మందికి పైగా జనాభా నివసిస్తున్నామన్నారు. ఆరు నెలలుగా తాగనీటి సమస్య ఉందన్నారు. సమస్యను సంబంధిత పంచాయతీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు. వేసవి తీవ్రత రోజుజోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య కూడా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం వార్డులో గల రెండు గొట్టపు బావులు పనిచేయడంలేదని, తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.