10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
భువనేశ్వర్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2.28 లక్షల మంది రైతుల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం సేకరించినట్లు రాష్ట్ర ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో వెల్లడించారు. కనీస మద్దతు ధరగా (ఎంఎస్‌పీ) రైతుల ఖాతాలకు రూ.1,790 కోట్లు, పెట్టుబడి సహాయంగా రూ.552 కోట్లు జమ చేసినట్లు వివరించారు. బుధవారం లోక్‌సేవా భవన్‌లో ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ సింగ్, ఒడిశా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.సుదర్శన్ చక్రవర్తితో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ముందుగా ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్‌సింగ్ శాఖ ప్రగతిని వివరించారు. 4 లక్షల మెట్రిక్ టన్ను ల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ప్రభు త్వం ఆమోదం తెలిపినందున 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.


