నూతన కార్యవర్గం ఎంపిక
పర్లాకిమిడి: గజపతి జిల్లా బీజేపీలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తెచ్చేందుకు కొత్త సంవంత్సంరం సందర్భంగా.. కొత్త కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో ఎంపిక చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహాన్ సామల్, రాష్ట్ర బీజేపీ ప్రభారి, మాజీ కేంద్ర మంత్రి విశ్వేశ్వర తుడు ఆమోదించారు. బీజేపీలో కొత్త కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షుడిగా నియమించారు. వారిలో కొత్తగా మామిడి రాజేశ్వరీ, గేదెల శ్రీధర్‌నాయుడు, పి.బాబూరావు, కృష్ణచంద్ర బిశోయి, ఆర్.విజయకుమార్, శివరాం మహాంకుడో, చందనా బోడోముండి, కామదేవ్ బోడో నాయక్ ఉన్నారు. 8 మంది కార్యదర్శుల్లో పాత, క్రొత్త ముఖాలున్నాయి. వారిలో జగన్నాథ మహాపాత్రో, అంబియా ప్రసాద్ ఘోడెయి, ఈ.ప్రశాంత్, కార్యదర్శులుగా కె.వేణుగోపాల్ (గారబంద), రోక్కం సతీష్ (కాశీనగర్), యం.లోకనాథం, ఉమాశంకర్ పాత్రో, సస్మితా మిశ్రా, మాయాదేవి మండళ్, సునీతా మల్లిక్, రజినీకాంత రయితో ఉన్నారు. కోశాధికారిగా వి.వరదరాజులు తిరిగి నియమింపబడ్డారు. వీరందరినీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరొ శుభాకాంక్షలు తెలిపారు.


