జగన్నాథ క్యాలెండర్‌లో తప్పిదం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయ అధికారిక ఎస్‌జేటీఏ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ వివాదాస్పదంగా మారింది. నిందులో దేవతాత్రయం (బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథస్వామి) వరుస క్రమం తప్పింది. ఈ లోపం పట్ల భక్తులు, సేవకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్యాలెండ ర్‌లో బలభద్రుడు, జగన్నాథుని స్థానాలు తారుమారయ్యాయి. రథయాత్ర చిత్రంలో ముందుగా దే వి సుభద్ర రథాన్ని లాగుతున్నట్లు, తరువాత జగ న్నాథుని రథాన్ని, చివరకు బలభద్రుని రథాన్ని లా గుతున్నట్లు ముద్రించడంతో పొరపాటు దొర్లింది.
ఈ లోపం పలువురు భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని, దీనిని సరిదిద్దడానికి తక్ష ణ చర్యలు తీసుకోవాలని ఆలయ సేవకుల వర్గం కోరారు. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి స్పందిస్తూ భక్తులకు క్షమాపణ కోరారు. క్యాలెండర్ల అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. క్యాలెండర్‌లో ఉపయోగించిన చిత్రం స్టేట్ మ్యూజియంలో భద్రపరచబడిన 100 సంవత్సరాల క్రితం నాటి తాటి ఆకు పెయింటింగ్ ఆధారంగా రూపొందించిన్లు పేర్కొన్నారు. కళాకారుడు అందించిన చిత్రం క్యాలెండర్‌లో యథాతథంగా వాడామని, ఏమాత్రం ఉద్దేశపూర్వకంగా వినియోగించలేదని, ఏది ఏమైనా తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు.


