
ఉగ్రదాడి హేయకరమైన చర్య
భువనేశ్వర్: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనలో రాష్ట్రానికి చెందిన ప్రశాంత శత్పతి మరణం పట్ల రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి సమావేశం వాయిదా వేసినట్లు అధ్యక్షడు భక్త చరణ్ దాస్ ప్రకటించారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ దుఃఖ సమయంలో బాలసోర్ రెముణాకు చెందిన ప్రశాంత్ శత్పతి కుటుంబానికి పీసీసీ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అజయ్ కుమార్ లల్లూ, పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పీసీసీ మాజీ అధ్యక్షులు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, శరత్ పట్నాయక్, ప్రసాద్ హరిచందన్, శ్రీకాంత్ జెనా తదితరులు పాల్గొన్నారు.
జయపూర్ ఎయిర్‌పోర్టులో అప్రమత్తత
కొరాపుట్: టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంలో జయపూర్ ఎయిర్ పోర్టులో ముందస్తు అప్రమత్తత ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడులు, విమానాల హైజాక్ వంటి ఘటనల సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రయాణికులకు తెలియజేశారు.
కొట్‌పాడ్‌లో అమరులకు నివాళులు..
పెహల్గాంలో టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన వారికి కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ పట్టణంలో నివాళులు అర్పించారు. సిద్దార్ధ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

ఉగ్రదాడి హేయకరమైన చర్య

ఉగ్రదాడి హేయకరమైన చర్య