మహేంద్రతనయలో పడి వృద్ధుడు మృతి
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి మచ్చమర గ్రామంలో మహేంద్రతనయ నదిలో బుధవారం మధ్యాహ్నం ఒక వృద్ధుడు స్నానానికి వెళ్లి మునిగి మృతిచెందాడు. ఉప్పలాడ పంచాయతీ మచ్చమర గ్రామానికి చెందిన హనుమంత బాలకృష్ణ (62) నదికి స్నానం కోసం వెళ్లి మునిగి మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గురండి పోలీసు ఐఐసీ ఓం ప్రకాష్ పాత్రో మచ్చమర గ్రామానికి విచ్చేసి అగ్నిమాపక దళం సిబ్బంది ద్వారా మృతదేహాన్ని బయటకు తీయించి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిర్మాణ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్‌బోర్డు ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పనుల శాఖ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్‌బోర్డ్’ను బుధవారం ప్రారంభించారు. ఇది వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వాస్తవ కార్యాచరణ (రియల్–టైమ్) పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టుల దోషరహిత అమలును నిర్ధారించి సామర్థ్యం మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అధునాతన ఏఐ డాష్‌బోర్డ్ అన్ని ప్రధాన ప్రాజెక్టులతో సహా ప్రభుత్వ ఆస్తులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల తాజా వీక్షణను అందిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో ప్రాజెక్టుల గురించి వివరణాత్మక సమాచారం అనుక్షణం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కచ్చితమైన స్థానాలను గుర్తించడానికి సమాచారానికి సంబంధించిన ఉపగ్రహ పటాలు చూసేందుకు వీలవుతుంది.
మహేంద్రతనయలో పడి వృద్ధుడు మృతి


