● క్రికెట్ విజేత కలహండి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని దొరగుడ వద్ద గల ఉత్కళ అల్యూమినియం ఇంటర్ నేషనల్ కర్మాగారం ఆధ్వర్యంలో ఉషాపడు టౌన్ షిప్ మైదానంలో శనివారం స్టేక్ హోల్డర్ ఫ్రెండ్ షిప్ ఒక్కరోజు క్రికెట్ టోర్నమెంటు జరిగింది. జిల్లా ఎస్పీ స్వాతి ముఖ్యఅతిథిగా, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఏఎస్పీ బిష్ణు ప్రసాద్ పాత్రోలు గౌర అతిథులుగా హాజరయ్యారు. 5 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌కు మ్యాచ్ కలహండి –11, రాయగడ –11 కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జట్లు చేరుకున్నాయి. ఫైనల్‌లో కలహండి–11 జట్టు విజేతగా నిలిచింది. కర్మాగారం యూనిట్ హెడ్ మజూర్ బేగ్, జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ అలీనూర్, కలహండి జిల్లా క్రీడాశాఖ అధికారి రమేష్ కుమార్ పాడి తదితరులు విజేత జట్టుకు ట్రోఫీని అందించారు.
● క్రికెట్ విజేత కలహండి


