
టన్నెల్‌ను సందర్శించిన సీఎల్‌పీ నేత
కొరాపుట్: భారత్‌మాల సొరంగ మార్గాన్ని(టన్నెల్) కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు రాంచంద్ర ఖడం శుక్రవారం సందర్శించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి సుంకీ సమీపంలోని అంపావల్లి గ్రామం వద్ద సొరంగ మార్గంలోనికి అనుచరులతో కలిసి ప్రవేశించారు. నిర్మాణ వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ.20 వేల కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కి ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్( భారత మాల జాతీయ రహదారి) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
లోయలో పడిన లారీ
● డ్రైవర్, క్లినర్‌కు గాయాలు
పర్లాకిమిడి: గజపతి–గంజాం జిల్లాల సరిహద్దు తప్తపాణి ఘాటి వద్ద రాయగడ నుంచి బరంపురం వెళ్తున్న 16 చక్రాల లారీ (ట్రక్కు) అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడిపోయిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పేపరు లోడుతో ఉన్న లారీ అదుపుతప్పి తప్తపాణిఘాటి జకరపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లినర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుడామర్రి పోలీసు ఠానా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గతంలో పలు సార్లు ఇదే ఘాటి మలుపు వద్ద ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

టన్నెల్‌ను సందర్శించిన సీఎల్‌పీ నేత