వైభవంగా హనుమాన్ జయంతి
రాయగడ: స్థానిక డైలీ మార్కెట్‌లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ధ్యానాంజనేయ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరిగాయి.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: ఒడియా వారికి నూతన సంవత్సరం వృషభ సంక్రాంతి, హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో పలు ఆంజనేయస్వామి మందిరాలకు ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. స్థానిక గుండిచా మందిరం వద్ద పురాతన హనుమాన్ మందిరం వద్ద భక్తులు దీపారాధన చేసి అఖండదీపాలు వెలిగించారు. తెలుగు సొండి వీధి అభయాంజనేయస్వామి మందిరం వద్ద ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణంలో కేవుటి వీధి, బెత్తగుడ వద్ద ఆంజనేయస్వామి, గాజుల వీధిలో ఉచిత అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు.
కొరాపుట్‌లో..
కొరాపుట్: కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాలలో హనుమాన్,రామ,బాలాజీ,శివ మందిరాలు కిటకిటలాడాయి. విశ్వ సంక్రాంతి సందర్భంగా రోడ్ల పై పానకాలు పంపిణీ చేస్తూ పొణ సంక్రాంతి జరుపుకున్నారు.
జయపూర్ డైలీ మార్కెట్‌లో హనుమాన్‌ని దర్శించుకుంటున్న మాజీ మంత్రి రబినందో, శివ పట్నాయక్
వైభవంగా హనుమాన్ జయంతి
వైభవంగా హనుమాన్ జయంతి
వైభవంగా హనుమాన్ జయంతి
వైభవంగా హనుమాన్ జయంతి


