శ్రీరామ నవమి ఉత్సవాలకు శ్రీకారం
జయపురం: ఈ నెల ఆరో తేదీన జరుగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలకు జయపురం పట్టణంలో విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక రఘునాథ్ మందిరం ఆవరణలో సోమవారం మూహూర్తపు రాట వేశారు. కార్యక్రమంలో శ్రీరామ నవమి పూజా కమిటీ సభ్యులతో పాటు పట్టణంలోని శ్రీరామ భక్తులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గున్నారు. ఈ సందర్భంగా పూజా కమిటీ సభ్యులు జయపురం మహారాణిని శ్రీరామ నవమి పూజా కార్యక్రమాలకు ఆహ్వానించారు. అన్ని గ్రామాల నుంచి రామ భక్త బృందాలు రఘునాత్ మందిరంలో జరుపగనున్న శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్టణంలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. రఘునాథ్ మందిరాన్ని అందంగా తీర్చి దిద్దుతున్నారు. స్థానిక జమాల్ లైన్‌లో శ్రీరామ నవమి ఉత్సవాలు జరిపేందుకు శ్రీసీతా రామాంజనేయ ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తున్నది.
శ్రీరామ నవమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీరామ నవమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీరామ నవమి ఉత్సవాలకు శ్రీకారం


