జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ అండర్–19 విభాగంగాలో బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని డీపీ అకాడమీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సంబంధిత ప్రతినిధి నిమయి చరణ దాస్ వెల్లడించారు. ఈ పోటీలలో 94 మంది బాల బాలికలు పాల్గొంటారన్నారు. 15 మంది పర్యవేక్షిస్తారన్నారు. పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రలో పలు ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లు, వారితో వచ్చిన సహాయకులకు వసతి, భోజన సౌకర్యాలు అకాడమి కల్పిస్తోందన్నారు. సమావేశంలో డీపీ అకాడమీ సభ్యులు దేవ దత్త దాస్, సుభ్రత కుమార్ పండ, గౌరీ పట్నాయక్ పాల్గొన్నారు.