మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి సింద్రీమాల పంచాయతీ బందుగూఢ గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు గాయపడ్డారు. మల్కన్‌గిరి నుంచి ఏదో పని చూసుకుని తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్న వారిని ఓ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఉడాపా గ్రామానికి చెందిన జగన్నాఽథ్ కాబాసి అతని చెల్లి హిరామాణి కబాసిలు మల్కన్‌గిరికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ వెంటనే వారిని స్థానికుల సాయంతో మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోలీసులకు లొంగిపోయాడు. మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో కేసు నమోదు చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాడు.
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లకు తీవ్ర గాయాలు