శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక తొలి నెలలోనే వలంటీర్లను దూరం పెట్టి సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇచ్చి వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు.
క్షయ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా తన చాంబర్‌లో శనివారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి వ్యాప్తి, వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షయ వ్యాధి చికిత్స విధానం తెలియజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఉగాది కాదు.. ఇది కూటమి దగా!