పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు

Published Sun, Mar 23 2025 9:24 AM | Last Updated on Sun, Mar 23 2025 9:18 AM

భువనేశ్వర్‌: నగరంలో గంజాయి, మద్యం ఇతరేతర మాదక ద్రవ్యాల విక్రయాల జోరు పెరుగుతోంది. ఊహాతీతమైన రీతుల్లో ఈ పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా ఓంఫెడ్‌ పాల కేంద్రాల్లో గంజాయి దమ్ము సిగరెట్లు విక్రయిస్తున్నట్లు బట్టబయలైంది. స్థానిక జయదేవ్‌ విహార్‌ ప్రాంతంలోని 2 ఓంఫెడ్‌ పాల కేంద్రాల్లో సిగరెట్ల ముసుగులో గంజాయి విక్రయిస్తున్న రాకెట్‌ గుట్టు రట్టు అయింది. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో కమిషనరేట్‌ పోలీస్‌ స్పెషల్‌ క్రైమ్‌ శాఖ ఈ ముఠా వ్యవహారాన్ని ఛేదించింది. గంజాయి అక్రమ విక్రయానికి ఆశ్రయం కల్పించిన 2 ఓంఫెడ్‌ పాల కేంద్రాలను సీజ్‌ చేశారు.

పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు 1
1/2

పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు

పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు 2
2/2

పాల కేంద్రాల్లో గంజాయి అమ్మకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement