● కాలం చెల్లిన మందులు, నిషేధిత
మత్తు సిరప్‌లు లభ్యం
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని అంబటి సత్రం జంక్షన్‌లో ఉన్న రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దుకాణంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా గడువుదాటిన మందులు, నిషేధిత మత్తు టానిక్‌లు దుకాణంలో లభ్యమయ్యాయి. దీంతో ఈ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుని యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. వెంకటరత్నం మెడికల్ దుకాణంలో అధిక మొత్తంలో మత్తు కలిగించే నిషేధిత టానిక్‌లు పట్టుకుని సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో ఔషధ నియంత్రణశాఖ ఎ.డి రజిత పాల్గొన్నారు.