విజయనగరం అర్బన్: నెల్లూరులోని విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఆంధ్రయూనివర్సిటీ నుంచి పోటీ పడే జట్టులో విజయనగరం పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల క్రీడాకారులు ముగ్గురు ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగిన అంతర్ కళాశాల బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభచూపిన ఎం.దుర్గాప్రసాద్, ఐ.నవీన్‌కుమార్, ఎన్.భవానీప్రసాద్ ఎంపికై న తుదిజట్టులో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న వారిని మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్‌రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాంబశివరావు, పీడీ డాక్టర్ పి.రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.