రాయగడ: వైద్య రంగంలో భాగమైన బీఫార్మా చదువును పూర్తి చేసుకున్న విద్యార్థులు సేవా దృక్పథంతో ముందుకు సాగాలని.. వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయం బీ. ఫార్మా విభాగం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ పాత్రో అన్నారు. స్థానిక పితామహాల్‌లోని సెంచ్యూరియన్ విశ్వవిద్యాలయంలోని బీ ఫార్మ చివరి సంవత్సరం చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన వీడ్కొలు సభలో ప్రసంగించారు. వైద్య రంగంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఇటువంటి కోర్సుల్లో ఆసక్తి కనబరిచి చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. వాటిని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ దీపక్ రౌత్, డాక్టర్ హరగౌరి మిశ్రా, డాక్టర్ కామిని శెఠి అన్నారు.