మల్కన్‌గిరి : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆశ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు శుక్రవారం మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో జిల్లా ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆశ వర్కర్లకు నెలకు రూ. 18 వేలు వేతనం పెంచాలి, మరణించే కార్యకర్త కుటుంబానకి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ సమయంలో పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.