కొరాపుట్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క శుక్రవారం భేటీ అయ్యారు. తనను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన పలువురికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేయించారు. అందులో భాగంగా ఎంపీ ఉల్క కూడా వెళ్లారు.
బీమా పరిహారం అందజేత
రాయగడ: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీలోని కొనగా గ్రామానికి చెందిన నాయికొ మండంగి కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకంలో భాగంగా రూ.2 లక్షల బీమా పరిహారం స్థానిక ఉత్కళ గ్రామీణ బ్యాంకు అధికారి శుక్రవారం అందజేశారు. నాయకొ మడంగి ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆయన చేసిన బీమా నగదును ఇంటికి వెళ్లి బాధితుడి భార్య కుడుంజికి అందించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కొరాపుట్ ఎంపీ భేటీ