పర్లాకిమిడి: ఒడిశా జగన్నాథ సంస్కృతిలో పకాలన్నం (చద్దన్నం) తినడం ఒక ఆనవాయితీ అని, స్వయంగా ఈ రోజు జగన్నాథ స్వామి పకాలన్నం, తోటకూర నైవేద్యంగా సేవాయత్‌లు అందజేస్తారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి స్థానిక రాజావారి ప్యాలస్‌లో ఉంటున్న యొటెక్ కంప్యూటర్ కార్యాలయంలో ప్రపంచ పొఖాలొ (చద్దన్నం) దినోత్సవాన్ని ప్రారంభించారు. చద్దన్నం తినడం ఎండా కాలంలో శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, బినోదిని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ పట్నాయక్, విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగి హరిమోహన్ పట్నాయక్, బిచిత్రానంద బెబర్తా ముఖ్యవక్తగా వ్యవహరించారు. ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపథి ఆధ్వర్యంలో మహిళలు పోకాలో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పకాలన్నం, తోటకూర జావ, వివిధ వంటకాల పోటీల్లో విజేతలైన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రగతి మహిళా సంఘటన్ నిర్వాహకులు తనూజా శతపథిని సత్కరించారు. అనంతరం విద్యార్థులు కవితా పఠనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథులు పకాలన్నం, పెరుగు, తోటకూర, బంగాళాదుంపల పచ్చడి, తదితర ఆహార పదార్థాలను ఆరగించారు. ఈ కార్యక్రమాన్ని లోకనాథ మిశ్రా, అధ్యక్షురాలు కల్పనా పట్నాయక్, మురళీ పోరిచ్చా తదితరులు పర్యవేక్షించారు.
ఘనంగా ప్రపంచ పొఖాలొ దివాస్
ఘనంగా ప్రపంచ పొఖాలొ దివాస్