రోడ్డు రోలర్‌ కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు రోలర్‌ కాల్చివేత

Mar 20 2025 1:08 AM | Updated on Mar 20 2025 1:05 AM

మల్కన్‌గిరి : కోరుకొండ సమితి పోట్రేల్‌ కూడలి సమీపంలో తెంతులిగూడ రహదారి పనుల కోసం వినియోగిస్తున్న రోడ్డు రోలర్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ మేరకు బీఎన్‌ఎస్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం కోరుకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఐఐసీ హిమాంశు శేఖర్‌ బారిక్‌ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

పెనుగాలుల బీభత్సం

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితిలో మంగళవారం రాత్రి పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు రోడ్లపై నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో వీచిన గాలులకు బొయిపరిగుడ సమితి దసమంతపూర్‌ పంచాయతీ పకులపొడ రహదారిలో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. బొయిపరిగుడ అగ్నిమాపకసిబ్బంది చేరుకొని చెట్టును తొలగించారు.

కవి రమాకాంత రథోకు

ఘన నివాళి

జయపురం: పద్మభూషణ కవి రమాకాంత రథో సంస్మరణ సభను జయపురం విక్రమ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించా రు. విశ్వ విద్యాలయ ఒడియా విభాగం వారు నిర్వహించిన కార్యక్రమంలో రమాకాంత రథో చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయ ఒడియా విభాగ అధిపతి అరుణ కుమార్‌ రాజు మాట్లాడుతూ.. రమాకాంత రథ్‌ మరణం ఒడిశా సాహిత్య రంగానికి తీర్చలేని లోటని అన్నారు. ఒడియా సాహిత్యానికి, సాహిత్య ప్రగతికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాల య అధ్యాపకులు సంజయ కుమార్‌ సాహు, వాణీశ్రీ రాయ్‌ పాల్గొన్నారు.

వరుస దొంగతనాలు

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో రోజు రోజుకీ బైక్‌ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక్క రోజులో మూడు చొట్ల దొంగతనానికి ప్రయత్నించి విఫలం చెందారు. మంగళవారం రాత్రి మల్కన్‌గిరి మెడికల్‌ కాలనీలో దొంగలు గేట్‌ తాళం పగలుగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఓ ఉపాధ్యాయుడు అద్దెకు ఉంటున్నా రు. ఆయన బైక్‌తోపాటు మారో బైక్‌ను దొగ లించాలని తాళాలు విరగొట్టే ప్రయత్నం చేశా రు. బైక్‌కు సెన్‌సార్‌ లాక్‌ ఉండటంతో దొంగ లించలేక పార్ట్‌లు తీసుకెళ్లారు. 3 గంటల సమ యంలో ఓ మొబైల్‌ షాప్‌ వద్ద ఉన్న బైక్‌లను దొంగలించారు. ఘటనపై ఈ రోజు బుధవా రం మల్కన్‌గిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాధు చేశారు. ఐఐసీ రీగాన్‌కీండో కేసు నమోద్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నైపుణ్యాలను అలవరుచుకోవాలి

పర్లాకిమిడి: సాంకేతిక విద్య, ఎంబీఏ విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను అలవరుచుకోవాలని, కానీ అందుకు భిన్నంగా చాలామంది విద్యార్థులు వార్షిక ప్యాకేజీ చాలదంటూ పలు కంపెనీల చుట్టూ తిరిగే సంస్కృతి ఇటీవల ఎక్కువైందని ఈర్డీస్‌ అడ్వయిజరీ ప్రైవేటు కంపెనీ ఆర్థిక సలహాదారు రవి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్‌.సీతాపురం సెంచూరియన్‌ వర్శిటీ క్యాంపస్‌లో బుధవారం స్టూడెంట్స్‌, మేనేజ్‌మెంట్‌ ఈవెంట్‌ ‘మంజర్‌ 2.ఓ’ కార్యక్రమం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రి, ఎంబీఏ, బీటెక్‌ విద్యార్థుల సందేహాలను కోల్‌కోత్తా, ఐఐఎం పూర్వపు విద్యార్థి రవి సుబ్రహ్మణ్యం నివృత్తి చేశారు. కార్యక్రమంలో స్వాధా ఫౌండేషన్‌ ట్రస్టీ మోహన్‌ కుమార్‌ రామ్మూర్తి, రాం నారాయణ్‌ శ్రీనివాసన్‌, సెంచూరియన్‌ వర్శిటీ రిజిస్ట్రార్‌ అనితా పాత్ర, మేనేజ్‌మెంట్‌ డీన్‌ ప్రజ్ఞాపాణి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు రోలర్‌ కాల్చివేత   1
1/4

రోడ్డు రోలర్‌ కాల్చివేత

రోడ్డు రోలర్‌ కాల్చివేత   2
2/4

రోడ్డు రోలర్‌ కాల్చివేత

రోడ్డు రోలర్‌ కాల్చివేత   3
3/4

రోడ్డు రోలర్‌ కాల్చివేత

రోడ్డు రోలర్‌ కాల్చివేత   4
4/4

రోడ్డు రోలర్‌ కాల్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement