కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శిశు బటిక పథకంపై ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధ వారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఏప్రిల్ 2 నుంచి ఈ పథకంలో భాగంగా ఐదేళ్లు నిండిన చిన్నారులను సమీప పాఠశాలల్లో తప్పక చేర్పించాలంటూ కరపత్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కునునాయక్, కౌన్సిలర్ రంజితా పండా పాల్గొన్నారు.
వ్యోమగాములకు అభినందనలు
భువనేశ్వర్: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన నాసా క్రూ–9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితర ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.


