చిక్కుల్లో ఎమ్మెల్యే.. నా భర్తకు మరో వివాహితతో సంబంధం ఉంది.. 

- - Sakshi

భువనేశ్వర్‌: కేంద్రపడా నియోజకవర్గ ఎమ్మెల్యే, అధికార పార్టీ బిజూ జనతాదళ్‌ నాయకుడు, మాజీమంత్రి శశిభూషణ్‌ బెహరా చిక్కుల్లో పడ్డారు. అతని కుటుంబం గృహహింస, వరకట్న వేధింపులు పెడుతున్నారని కోడలు రోనాలి బెహరా(31) బంకి ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021 మార్చి 3న ఎమ్మెల్యే కుమారుడు సత్యప్రకాష్‌తో ఆమెకు వివాహం జరిగింది.

అయితే తన భర్త మరో వివాహితతో సంబంధం కలిగి ఉన్నాడని, సత్యప్రకాష్‌ తోపాటు అత్తమామలు, ఆడపడుచులు, ఇతర కుటుంబీకులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చాలని నిరంతరం వేధిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి రూ.40 లక్షలు తీసుకు రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. మెట్టినింటికి వచ్చిన 10 రోజులకే పుట్టింటి వారు ఇచ్చిన నగలన్నీ తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారన్నారు. చెప్పినట్లు వినలేదని దుర్భాషలాడి, మాససికంగా కుంగదీశారని వాపోయారు.

అయితే తన కోడలు చేసిన ఆరోపణలను నిరాధారమైనవి, అంతా అవాస్తవమని ఎమ్మెల్యే శశిభూషణ్‌ కొట్టిపారేశారు. తన కొడుకు, రోనాలి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి ఉండవచ్చన్నారు. మెట్టినింటికి వచ్చిన తర్వాత నామమాత్రంగా నెల రోజులు మాత్రమే ఆమె తమతో ఉన్నారని, అనంతరం తన తండ్రితో కలిసి పుట్టినింటికి వెళ్లి తిరిగి రాలదేని తెలిపారు. వరకట్న డిమాండ్‌ ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంచేశారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top