కూటమిలో అసమ్మతి రాగం! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో అసమ్మతి రాగం!

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

కూటమిలో అసమ్మతి రాగం! నగర ప్రథమ పౌరుడి ప్రమాణ స్వీకారానికి కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం సోమవారం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కూటమి పార్టీల్లో ఐక్యత పైన పటారం... లోన లొటారం అన్నట్టుగా ఉందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంబేడ్కర్‌ సాక్షిగా కూటమి పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపించాయి. ● మేయర్‌ రాధా ప్రమాణ స్వీకారానికి హాజరు కాని నగర ఎమ్మెల్యేలు ● తన కొడుకును కాకుండా రాధాకు మేయర్‌ పదవి దక్కటంతో సెంట్రల్‌ ఎమ్మెల్యే కినుక ● డెప్యూటీ మేయర్‌ పదవి విషయంలో సీనియర్లను కాదని తూర్పు ఎమ్మెల్యే ప్రతిపాదనపై ఆ పార్టీలోనే అసంతృప్తి ● యథావిధిగా వీఎంసీని పట్టించుకోని పశ్చిమ ఎమ్మెల్యే ● డెప్యూటీ మేయర్‌ పశ్చిమకు కేటాయించాలన్న ప్రతిపాదనను పార్టీ తిరస్కరించటంతో అలిగిన బుద్దా వెంకన్న పటమట(విజయవాడతూర్పు): ఆర్భాటంగా జరిగిన విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్న విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం నగరంలో తాజాగా చర్చనీయాంశమైంది. వీఎంసీ నుంచి ప్రొటోకాల్‌ ప్రకారం అధికారికంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపినప్పటికీ సోమవారం జరిగిన కార్యక్రమానికి వారెవరూ హాజరుకాకపోవటం కూటమి నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు పొసగని వీరి తీరు.. ఎన్నికల తర్వాత కూడా వారి మధ్య ఉన్న పొరపచ్చాలు ఈ విధంగా బయటపడుతున్నాయని అంటున్నారు. ఎన్నికల సమయంలో అందరం కలిసే ఉన్నామని పైకి ప్రచారం చేసినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవకపోవటం నగరంలో మరోమారు రాజకీయ చర్చకు దారితీసింది. తన కొడుకుకు దక్కలేదని... విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థకు విజయవాడ మేయర్‌ పదవి కోసం టీడీపీ పెద్దల వద్ద విశ్వప్రయత్నం చేశారు. కానీ కూటమి సర్దుబాట్లలో భాగంగా మేయర్‌ పదవి జనసేనకు కేటాయించటంతో అసంతృప్తిగా ఉన్న ఆయన సీట్ల సర్దుబాటులో కూడా అసంతృప్తి గానే ఉన్నారని తెలిసింది. ఆయన మేయర్‌ ప్రమాణ స్వీకారానికి రాకపోవటానికి అదే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన కుమారుడి అయ్యప్ప భజన కార్యక్రమం వల్ల రాలేకపోయానని ఆయన ప్రచారం చేస్తున్నప్పటికీ తెర వెనక ఉన్న కారణం ఇదేనని అంటున్నారు. యథాప్రకారం సుజనా సైతం... పశ్చిమ నియోజకవర్గ ఎమ్యెల్యే సుజనా చౌదరి యథాప్రకారం వీఎంసీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. రెండున్నరేళ్లుగా ఆయన గైర్హాజరీ మామూలైంది. అయితే ప్రస్తుతం మేయర్‌ ప్రమాణ స్వీకారానికి రాకపోవటంపై బీజేపీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇచ్‌చార్జిగా ఉన్న బుద్దా వెంకన్న కూడా కార్యక్రమానికి హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. తన వర్గం నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో ఒకరికి డెప్యూటీ మేయర్‌ పదవి ఇవ్వాలని కోరగా పార్టీ పట్టించుకోలేదు. పశ్చిమకు ఒక్క పదవి కూడా రాలేదని, మేయర్‌, డెప్యూటీ మేయర్‌ మొత్తం తూర్పు నియోజకవర్గ నాయకులే ఎగరేసుకుపోయారన్న అసంతృప్తితో వెంకన్న రాలేదని సమాచారం.

భాగస్వామ్య పార్టీల్లో బట్టబయలైన పొరపచ్చాలు

తప్పించుకునేందుకే...

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ పేరును జనసేన ప్రకటించినప్పటి నుంచి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అసంతృప్తిగానే ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియకు కూడా ఆయన హాజరుకాకుండా ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలి హోదాలో తన భార్య, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధను పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా డెప్యూటీ మేయర్‌ పదవిని పార్టీలోని సీనియర్లను కాదని తన వర్గానికే కేటాయించేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించటంపై టీడీపీ సీనియర్‌ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైతే సీనియర్ల నుంచి విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో కూడా ప్రమాణ స్వీకారానికి గద్దె హాజరు కాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

నగర ప్రథమ పౌరుడి ప్రమాణ స్వీకారానికి కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం సోమవారం నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కూటమి పార్టీల్లో ఐక్యత పైన పటారం... లోన లొటారం అన్నట్టుగా ఉందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంబేడ్కర్‌ సాక్షిగా కూటమి పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపించాయి.
● మేయర్‌ రాధా ప్రమాణ స్వీకారానికి హాజరు కాని నగర ఎమ్మెల్యేలు ● తన కొడుకును కాకుండా రాధాకు మేయర్‌ పదవి దక్కటంతో సెంట్రల్‌ ఎమ్మెల్యే కినుక ● డెప్యూటీ మేయర్‌ పదవి విషయంలో సీనియర్లను కాదని తూర్పు ఎమ్మెల్యే ప్రతిపాదనపై ఆ పార్టీలోనే అసంతృప్తి ● యథావిధిగా వీఎంసీని పట్టించుకోని పశ్చిమ ఎమ్మెల్యే ● డెప్యూటీ మేయర్‌ పశ్చిమకు కేటాయించాలన్న ప్రతిపాదనను పార్టీ తిరస్కరించటంతో అలిగిన బుద్దా వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement