దుర్గమ్మకు కానుకగా వెండి కంచం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు కానుకగా వెండి కంచం

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

దుర్గమ్మకు కానుకగా వెండి కంచం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణకు చెందిన భక్తులు గురువారం వెండి కంచంను కానుకగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రామగుండంకు చెందిన వీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ వారు 494 గ్రాముల వెండితో తయారు చేయించిన వెండి కంచాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మాతృ మరణాల నివారణకు పటిష్ట కార్యాచరణ డెర్మటాలజీ సదస్సులో సిద్ధార్థ ప్రొఫెసర్‌కు బంగారు పతకం నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

ఎన్టీఆర్‌ డీఎంహెచ్‌ఓ శ్రావణ్‌బాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతృ మరణాల నివారణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఎన్టీఆర్‌ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. జిల్లాలోని ఆశా నోడల్‌ ఆఫీసర్లతో మాతాశిశు ఆరోగ్య సంరక్షణపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆశా కార్యకర్తలకు నిర్వహిస్తున్న కపుల్స్‌ కోర్స్‌ శిక్షణ కార్యక్రమం అమలు, ఆశా కార్యకర్తల వర్క్‌ సమన్వయం, హైరిస్క్‌ కరెక్షన్స్‌తో పాటు మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రత్యేకంగా దృష్టి సారించి క్లోజ్‌ మానిటరింగ్‌ ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌బాబు మాట్లాడుతూ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, 102 వాహన సేవలను సమర్థంగా వినియోగించుకోవడం, అవసరమైన సమయంలో గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో తల్లి, బిడ్డకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందించడం ద్వారా మాతృ మరణాలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పీహెచ్‌సీలలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, రేణుక, కృష్ణకుమారి, సుహాసిని పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల 15న విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి చర్మ వ్యాధుల సదస్సులో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు ప్రతిభ చాటారు. ఆ కళాశాల చర్మ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్‌ టి.వాణికి ఉత్తమ ప్రచురణ అవార్డుగా బంగారు పతకం లభించింది. ఆమె ఆధ్వర్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి డాక్టర్‌ పి.నేహా సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది. రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ వైద్య కళాశాల పేరును అత్యత్తుమ స్థాయిలో నిలబెడుతున్న ప్రొఫెసర్లు, పోసు్ట్రగాడ్యుయేట్‌ విద్యార్థులను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ల ఎన్నిక ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం జరగనుంది. ఎన్నికకు సంబంధించి జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. తొలుత జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి గంపలగూడెం మండల జెడ్పీటీసీ కోట పుల్లమ్మకు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆశీస్సులు ఉన్నాయి. పెనుగంచిప్రోలు జెడ్పీటీసీ సుధీర్‌ కూడా జెడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నట్లు తెలిసింది. జిల్లా పరిషత్‌ కో–ఆప్టెడ్‌ (02) సభ్యుల ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి జారీ చేసే ఉత్తర్వుల మేరకు నిర్ణయించిన తేదీన జరుగుతుందని ప్రిసైడింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement