డిసెంబర్‌ 18 నుంచి హార్టీకల్చర్‌ షో | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 18 నుంచి హార్టీకల్చర్‌ షో

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

డిసెంబర్‌ 18 నుంచి హార్టీకల్చర్‌ షో

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పూల మొక్కల సాగు, ఉద్యాన వనాల అభివృద్ధి, పచ్చదనం విస్తరణతో పాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెంపొందించేందుకు రోజ్‌ అండ్‌ అగ్రి హార్టీకల్చర్‌ షో దోహదపడుతుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, విజయ వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న 9వ రోజ్‌ అండ్‌ అగ్రి హార్టీ కల్చర్‌ షో పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. డిసెంబర్‌ 18 నుంచి 21వ తేదీ వరకు విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామన్నారు. నగర ప్రజలు, ప్రకృతి ప్రేమికులు, పూల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోజ్‌ సొసైటీ అధ్యక్షురాలు కె.లక్ష్మీతులసి, కార్యదర్శి కె.విశాల, సభ్యులు సీతామహాలక్ష్మి, జి.ఎస్‌.ఆర్‌.మోహన్‌ రావు, జి.లక్ష్మి, సుమబిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement