భగ్గుమన్న విభేదాలు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న విభేదాలు

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 భగ్గుమన్న విభేదాలు

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ఒప్పందాలకు భిన్నంగా తమ వారిని ఎంపిక చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కింది. దీనిపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో జనసేన నేత నిరసన ... రాజీనామా ప్రకటన... విజయవాడ రూరల్‌లో టీడీపీ ఎంపీటీసీలు ఎన్ని కల బహిష్కరణ. ఇలా వివాదాల మధ్య ఉమ్మడి కృష్ణా ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. మచిలీపట్నం సౌత్‌, నార్త్‌తో పాటు నాగాయలంక ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే...

● నాగాయలంకలో ఎన్నికకు ఎనిమిది మంది తెలుగుదేశం సభ్యులు డుమ్మా కొట్టడంతో సమావేశం కోరం లేక వాయిదా పడింది. సమావేశానికి జనసేన, వైఎస్సార్‌ సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎంపీపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో విభేదాల కారణంగా ఎన్నిక వాయిదా పడింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కన్నా నాగరాజు(ఎదురుమొండి), విశ్వనాథపల్లి భిక్షం (సంగమేశ్వరం) మధ్య పోటీ నెలకొంది. చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలన్న ఒప్పందం ఉన్నా వారు సమావేశానికి హాజరుకాలేదు.

● మచిలీపట్నం సౌత్‌, నార్త్‌ ఎంపీపీ ఎన్నికలు మంత్రి కొల్లు రవీంద్ర సోదరి మరణంతో వాయిదా వేశారు.

● అవనిగడ్డ ఎంపీపీ పదవి జనసేనలో అసమ్మతి రగిలించింది. పదవి దక్కకపోవడంతో జనసేన మండల కన్వీనర్‌, ఎంపీటీసీ సభ్యుడు గుడివాక శేషుబాబు రాజీనామాకు సిద్ధపడ్డారు. లంకమ్మ ప్రసాద్‌, గుడివాక శేషుబాబు చెరో రెండున్నరేళ్లు ఎంపీపీగా చేసేందుకు ప్రతిపాదనలు వచ్చినా ముందు తనకే ఇవ్వాలని శేషుబాబు పట్టుపట్టడంతో ఎమ్మెల్యే దీనికి తిరస్కరించి లంకమ్మ ప్రసాద్‌కు బీఫారం ఇచ్చారు. దీంతో శేషుబాబు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు.

● మొవ్వ మండలంలో అయ్యంకి సెగ్మెంట్‌ నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి తాతా రత్నమాణిక్యాన్ని ఎంపీపీగా ఆ పార్టీ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఎంపీపీ బీజేపీకి కేటాయించినట్టు ప్రకటించడంతో ఆమె బీజేపీ కండువా కప్పుకుని ఎంపీపీగా ఎన్నికై ంది. ఈ పరిణామం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

● గూడూరు ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినా, వైస్‌ ఎంపీపీ ఎంపిక మాత్రం చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపింది. ఎంపీపీగా బొల్లా రాజేష్‌ ఎన్నిక కాగా వైస్‌ ఎంపీపీ పదవిని ఆశిస్తున్న పోతన రామోజీ మధ్యాహ్నం వరకూ ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైస్‌ ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.

● విజయవాడ రూరల్‌ వైస్‌ ఎంపీపీ ఎన్నిక కూడా వివాదంగా మారింది. ఎంపీపీగా ప్రసాదంపాడు సెగ్మెంట్‌–2 నుంచి గెలిచిన కూటమి అభ్యర్థి పరుచూరి నరేష్‌ను ఎన్నుకున్నారు. వైస్‌ ఎంపీపీ ఎంపికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత వైస్‌ ఎంపీపీ పదవి ఎంపికను వాయిదా వేయాలని మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ సభ్యులు పట్టు బట్టారు. వైస్‌ ఎంపీపీగా రామవరప్పాడు 3వ సెగ్మెంట్‌ కూటమి ఎంపీటీసీ నభిగాని కొండాను ప్రతిపాదించగా, మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీలు దీన్ని వ్యతిరేకించారు. ఎన్నికల అధికారి సమక్షంలో చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ జరుగుతుండగానే మరోమారు వైస్‌ ఎంపీపీ ఎంపికను వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఎన్నికల అధికారి ఒప్పుకోకపోవడంతో మైలవరం నియోజకవర్గంలోని 13 మంది ఎంపీటీసీలు సమావేశాన్ని బహిష్కరించారు.

భాగస్వామ్య పార్టీలకే వెన్నుపోట్లు

బీజేపీ కండువా కప్పుకొని

ఎంపీపీగా ఎన్నికై న టీడీపీ అభ్యర్థి

జనసేనలో అసమ్మతి సెగలు

రాజీనామాలు...ఎన్నికల బహిష్కరణలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. మొవ్వ ఎంపీపీ పదవి పంపకాల్లో భాగంగా బీజేపీకి కేటాయించగా టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రత్నమాణిక్యం బీజేపీ కండువా కప్పుకుని ఎంపీపీగా ఎన్నికై ంది. అవనిగడ్డ ఎంపీపీ పదవి విషయంలో జనసేన ఎంపీటీసీ శేషుబాబు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నాగాయలంకలో ఎంపీపీ ఎన్నికను టీడీపీ సభ్యులు బహిష్కరించడంతో కోరం లేక ఎన్నిక వాయిదా వేశారు. విజయవాడ రూరల్‌ వైస్‌ ఎంపీపీ ఎన్నిక విషయంలో మైలవరం ఎంపీటీసీలు 13 మంది ఎన్నికను బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement