మల్లేశ్వరుడికి విశేష అలంకరణ | - | Sakshi
Sakshi News home page

మల్లేశ్వరుడికి విశేష అలంకరణ

Nov 19 2026 12:43 PM | Updated on Nov 19 2026 12:43 PM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరుడికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారికి బుధవారం త్రికాల అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సహాస్ర లింగార్చన సేవ జరిగింది. స్వామి వారికి పంచా మృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామికి పెసర, పంచదార, కమల తొనలు, పూలతో విశేషంగా అలంకరించారు. స్వామికి నిర్వహించిన పంచామృత అభిషేకాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తరలించారు. ప్రదోష కాలంలో స్వామి వారికి మహానివేదన, పంచహారతుల సేవ జరిగాయి. అనంతరం సహాస్ర దీపాలంకరణ సేవ జరగగా, పలువురు ఉభయదాతలు భక్తులు సేవలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement