హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె – కోల్కత్తా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. బాపులపాడు మండలం కె.సీతారామపురం వద్ద సర్వీస్ రోడ్డులో యువకుడు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం.శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ యువకుడు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ద్విచక్రవాహనంలో ఏసీ, ఎలక్ట్రికల్ మెకానిక్ సామగ్రి ఉన్నాయని, మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉండొచ్చని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ద్విచక్రవాహనం విజయవాడ చిరునామాతో రిజిస్టర్ కావటంతో వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


