జిల్లాలో 2,23,183 మందికి పింఛన్లు పంపిణీ కంచికచర్ల: పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది ద్వారా పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2,23,183 పింఛన్లకు గాను మొత్తం రూ.96.93 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు, నిర్లక్ష్యానికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించేందుకు సిబ్బందికి ముందుగానే దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట నందిగామ ఆర్డీఓ అనిల్‌కుమార్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఎంపీడీఓ దేవరపల్లి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మునీర్ అహ్మద్
లబ్బీపేట(విజయ వాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పలువురిని పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా విజయవాడ తూర్పు నుంచి స్టేట్ మైనార్టీ ఆఫిషియల్ స్పోక్ పర్సన్‌గా షేక్ మునీర్ అహ్మద్, స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా షేక్ ఇలియాస్‌లను నియమించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుంకర అంజనేయులు(జగ్గయ్యపేట), జిల్లా కార్యదర్శులుగా విజయవాడ వెస్ట్‌కు చెందిన చల్లా సుబ్రహ్మణ్యం, సయ్యద్ మెహబూబ్ రఫీలను, జిల్లా ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీగా దొడ్డా సురేష్, స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా ఎండీ అబ్దుల్ ఖువీద్, జిల్లా మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎస్డీ మొహమ్మద్ అలీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
జిల్లాకు చెందిన పలువురికి పార్టీ పదవులు
విజయవాడలీగల్: రాష్త్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ మరియు అదృశ్యం కేసు విషయం అందరికీ విదితమే. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎ1 నిందితుడు సీఐ నాగరాజుతోపాటు వివిధ జైళ్లలో ఉన్న ఎ2 పోతర్లంక అశోక్‌కుమార్, ఎ3 జంగం నాని, ఎ4 గులివిందల సురేష్, ఎ5 కై తేపల్లి బాబూరావు, ఎ6 గొరిపర్తి సాంబయ్యలను వర్చువల్‌గా పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు.