ఆకట్టుకున్న పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిర్వ హించిన ఈ కార్యక్రమాన్ని సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు పావురాలు, బెలూన్లను ఎగరవేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వీక్షించేందుకు వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు, యువతకు పోలీసు శాఖ సేవల గురించి అవగాహన కల్పించారు. అనంతరం పోలీసుల వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సైబర్‌ నేరాలను అరికట్టే పద్ధతులు, డాగ్‌ స్క్వాడ్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, కమ్యూనికేషన్‌, క్రైమ్‌ స్పాట్‌, ట్రాఫిక్‌, వాటర్‌ కెనాన్‌, వజ్ర, ఫలకాన్‌ తదితర వాహనాల పని తీరును ప్రదర్శించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్‌ పటేల్‌, తిరుమలేశ్వరరెడ్డి, షిరీన్‌బేగం, కేజీవీ సరిత, ఏబీటీఎస్‌ ఉదయరాణి, కృష్ణప్రసన్న, జి.రామకృష్ణ, బి.సత్యనారాయణ, ఏఆర్‌ ఏడీసీపీ ఎన్‌వి రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement