మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వైజాగ్‌లోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో 5వ సౌత్ ఇండియా జోనల్ కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీలు ఈ నెల 24, 25 తేదీల్లో జరుగనున్నాయని ది వరల్డ్ షోటాకాన్ కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి జె.విజయ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి కరాటే విద్యార్థులు ఎం.సుకీర్త్, బి.సహాస్యలహారి, వి.నాగ చైతన్య, డి.జ్ఞానప్రకాష్ కటా, కుమిటె విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలోని 69వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో టీడీపీ సీటు రాకపోవటంతో ఆ పార్టీ నాయకుడు బాబీ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బాబీ అనుచరులతో పాటు టీడీపీ, జనసేనకు చెందిన పలువురు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.


