వన్‌టౌన్‌ పీఎస్‌లో వైభవంగా చండీహోమం | - | Sakshi
Sakshi News home page

వన్‌టౌన్‌ పీఎస్‌లో వైభవంగా చండీహోమం

Oct 23 2026 2:03 AM | Updated on Oct 23 2026 2:03 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకొని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో గురువారం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్టేషన్‌ ప్రాంగణంలో కలశాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముగింపు సందర్భంగా వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో చండీహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు పలువురు ఐపీఎస్‌ అధికారులు స్వయంగా హాజరై పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాదిమంది పేదలతో పాటు, సీపీ, పోలీసు కుటుంబాలు సైతం స్టేషన్‌ ప్రాంగణంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక సీఐ గుణరాము కార్యక్రమాలను నిర్వహించారు.

ఉత్సవాలను విజయవంతం చేశాం..

తమ పోలీసు శాఖ అంకిత భావంతో పని చేసి దసరా ఉత్సవాలను విజయవంతం చేశారని పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు అన్నారు. వన్‌టౌన్‌ స్టేషన్‌ ప్రాంగణంలో పూజల అనంతరం ఆయన సిబ్బందిని అభినందించారు.

పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement