కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ

తిరువూరులో..

జగ్గయ్యపేటలో..

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. గురువారం ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 16 జెడ్పీటీసీ స్థానాలకు రెండో రోజు 53 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో మొత్తం 57 నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి 23, టీడీపీ నుంచి 21, బీఎస్పీ నుంచి రెండు, సీపీఎం నుంచి 4, కాంగ్రెస్‌ నుంచి మూడు నామినేషన్లు దాఖలు చేశాయి. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లాలో 16 మండలాల్లోని 280 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 749 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 73, గురువారం 676 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి 386, టీడీపీ నుంచి 297 దాఖలయ్యాయి.

హోరెత్తిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌తోపాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి ముని సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

విజయవాడ కార్పొరేషన్‌లో..

విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణలంకలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి వైఎస్సార్‌ సీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. మహిళా ఓటర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో కృష్ణలంక వాసులకు జరిగిన మేలును వివరించారు. ఆమె వెంట ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

కొండపల్లిలో..

కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి నల్లమోతు తేజస్వి 30వ వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థి కన్నెకంటి పద్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించారు. వైఎస్‌ జగన్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా గమనించా లని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి, కోమటి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తిరువూరు మునిసిపల్‌ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు 19వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్‌ అభ్యర్థి గజ్జల శ్రీదేవితో కలిసి వైఎస్సార్‌ ఫొటోతో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల స్థితి గతులు ఎలా ఉన్నాయో వివరించారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి నలగట్ల స్వామిదాసు, సుధారాణి ప్రచారం చేశారు.

జగ్గయ్యపేట మునిసిపాలిటీ వైఎస్సార్‌ సీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి హఫీజున్నీసా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఆమె గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఆమె వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు సతీమణి సుధారాణి ప్రచారంలో పాల్గొన్నారు. 25వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ జాన్‌ మియా ప్రచారం చేశారు. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement